ఐపీఎల్ 2022లో బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఎవిన్ లూయిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మ్యాచ్ లక్నో వశమైంది. లూయిస్ ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే మ్యాచ్‌లో కచ్చితంగా కేకేఆర్ విజయం సాధించి ఉండేది. కాగా కనీస ఫిట్‌నెస్ ప్రమాణాలను కూడా అందుకోలేదని వారం క్రితమే వెస్టిండీస్ క్రికెట్ టీమ్ నుంచి ఎవిన్ లూయిస్ ఉద్వాసనకు గురయ్యాడు. కానీ బుధవారం మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో లక్నోను గెలిపించి ప్లే ఆఫ్స్ చేర్చాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆఖరి ఓవర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయానికి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమవ్వగా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ చేతికి బంతినిచ్చాడు. కానీ.. స్టోయినిస్ బౌలింగ్‌లో తొలుత ఒత్తిడికి గురయ్యాడు. దాంతో.. తొలి మూడు బంతుల్నీ యువ ప్లేయర్ రింకూ సింగ్ వరుసగా 4,6,6గా హ్యాట్రిక్ బౌండరీలు బాదడంతో.. 3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. దాంతో.. కోల్‌కతా విజయం ఖాయమని అంతా భావించారు. కానీ.. నాలుగో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసి రెండు పరుగులు చేసిన రింకూ సింగ్.. ఐదో బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా గాల్లోకి లేపాడు. నిజానికి అక్కడ ఫీల్డర్ కూడా ఎవరూ లేకపోవడంతో.. రెండు పరుగులు వచ్చేలా కనిపించాయి. అయితే.. డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వేగంగా పరుగెత్తుకొచ్చిన ఫీల్డర్ ఎవిన్ లూయిస్ పక్కకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దాంతో మ్యాచ్ గెలిపించేలా ఉన్న రింకూ పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతిని ఆడిన ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. దాంతో ఉత్కంఠభరిత పోరులో కేకేఆర్ 2 పరుగులతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో కోల్‌కతా బౌలర్లు తేలిపోయారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(22 బంతుల్లో 9 ఫోర్లతో 42), సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), రింకూ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) ధాటిగా ఆడారు. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, మార్కస్ స్టోయినీస్ మూడేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. లక్నో 18 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: IPL 2022: కోల్‌కత్తా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం! లాస్ట్ బాల్ నరైన్ ఆడుంటే కథ వేరుండేది!
Rinku Singh almost powered KKR to a sensational victory but was denied by an even more sensational catch by Evin Lewis#IPL2022 #KKRvLSGhttps://t.co/J5Dch7mnWZ
— CricketNDTV (@CricketNDTV) May 19, 2022