Raksha Bandhan 2022: అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగే.. ‘రాఖీ పౌర్ణమి’. సోదరి తన సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి.. ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాఖీ పండుగ రోజు సోదరీమణులు “యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల” అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు.
ఆ తరువాత హారతి ఇచ్చి, నుదుటన బొట్టు పెట్టి స్వీట్ తినిపిస్తారు. చెల్లెలు అయితే అన్నకు, అక్క అయితే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. ఈ సందర్బంగా సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీ మణులకు ఎనలేని ప్రేమ. వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. తీపి జ్ఞాపకంగా భావిస్తారు. ఈ రాఖీ పండగ రోజు మీరు సోదరికి మంచి వస్తువులను బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఈ కథనం చదవండి. ఇక్కడ ది బెస్ట్ బహుమతుల గురించి వివరించాం. ఈ బహుమతులు జీవితంలో మరుపురానివిగా గుర్తుండిపోతాయి.
ఈ నేపథ్యంలో అలాంటి రక్షాబంధన్ విలువలు తెలిపే బెస్ట్ గిఫ్ట్స్ మీకోసం..
చీర:
రాఖీ పండగ రోజు సోదరికి ఇచ్చేందుకు సరైన గిఫ్ట్.. చీర. తెలుగు వారి సంప్రదాయాన్ని తెలిపే చీరలంటే మహిళలకు చాలా ఇష్టం.
మేకప్ కు సంబంధించిన యాక్సిసరీస్:
మేకప్ అంటే ఇష్టపడని అమ్మాయి ఎవరైనా ఉంటారా? అందుకే ఈ రాఖీకి మీ సోదరికి ఒక మంచి మేకప్ కిట్ గిఫ్ట్ గా ఇస్తే ఆమెకు ఎంతగానో నచ్చుతుంది
స్మార్ట్ వాచ్:
ప్రస్తుతం స్మార్ట్ వాచ్ అనేది అలంకారం నుంచి అవసరంగా మారిపోయింది. మరి అలాంటి స్మార్ట్ వాచ్ ని రాఖీకి మీ సోదరికి గిఫ్ట్ గా ఇస్తే ఆమె ఎంతగానో సంతోషిస్తుంది.
స్మార్ట్ ఫోన్:
ప్రస్తుతం మూడు నెలలకో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతోంది. మీ బడ్జెట్ కాస్త ఎక్కువగా ఉంటే.. మీ సోదరికి మంచి ఫీచర్లు, అప్‌డేటెడ్ స్మార్ట్ గిఫ్ట్ గా ఇస్తే బావుంటుంది.
హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వ్యాలెట్స్:
స్త్రీల అలంకారంలో హ్యాండ్ బ్యాగ్ ఒక భాగం అనే అనాలి. అది లేకుండా వారు ఎక్కడికీ వెళ్లలేరు. కాబట్టి మంచి బ్రాండెడ్ ఒక హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇస్తే మీ సోదరి కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతుంది.
హెయిర్ డ్రయ్యర్:
హెయిర్ డ్రయ్యర్.. కొంత మంది అమ్మాయిలు హెయిర్ డ్రయ్యర్ బాగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ లోనే చాలా మంచి హెయిర్ డ్రయ్యర్లు లభిస్తున్నాయి. దానిని గిఫ్ట్ ఇస్తే బావుంటుంది.
కుంకుమ భరిణి:
అమ్మాయికి పుట్టంటి నుంచి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఎంతో స్పెషల్. కాబట్టి పాత సంప్రదాయం ప్రకారం ఆమెకు ఒక కుంకుమ భరిణి గిఫ్ట్ గా ఇస్తే ఆనందిస్తారు.
1 గ్రాము గోల్డ్ జ్యూవలరీ:
ప్రస్తుతం ఆడవాళ్లు బంగారం కంటే 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 1 గ్రామ్ గోల్డ్ లో సెట్స్ రూపంలో అద్భుతమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అది గిఫ్ట్ గా ఎంచుకుంటే బావుంటుంది.
స్వీట్స్ అండ్ చాకోలెట్స్:
రాఖీ గిఫ్ట్ గా మంచి స్వీట్స్, ఇంపోర్టెడ్ చాకోలేట్స్ ని కూడా ఇవ్వచ్చు. బడ్జెట్ కూడా తక్కువలో మంచి స్వీట్స్, చాకోలెట్స్ లభిస్తాయి.
మరి, ఇంకెందుకు ఆలస్యం ఇందులో మీకు నచ్చిన కానుకను మీ ప్రియమైన వారి కోసం వెంటనే ఆర్డర్ చేయండి.