ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరూ ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రి ఆరేళ్ల కుమారుడుని షూ లేస్ తో ఉరేసి చంపాడు. అనంతరం తన కుమారుడి శవాన్ని చెరుకు తోటలో పడేసి నా కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలగా మారుతోంది. కన్న కొడుకు అన్న కనికరం లేకుండా తండ్రి అంతలా ఎందుకు తెగించాడు? కొడుకుని ఉరేసి చంపేలా అంతలా అతడు చేసిన నేరమేంటనే పూర్తి సమాచారం మీ కోసం.
ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలోని ధర్మేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అలా ఆరేళ్లు గడిచిపోయింది. అయితే గత కొంత కాలం నుంచి ధర్మేష్ తన భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. నా భార్యకు వేరే మగాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తరుచు భార్యతో గొడవకు దిగుతుండేవాడు. అయితే ఇటీవల మరోసారి ధర్మేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ధర్మేష్ తన 6 ఏళ్ల కుమారుడిని షూ లేస్ తో ఉరేసి చంపాడు. అనంతరం ఆ బాలుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా గ్రామంలోని చెరుకు తోటలో పడేశాడు. ఆ తర్వాత తనకేం సంబంధం లేదన్నట్టుగా మరసటి రోజు పోలీసులను ఆశ్రయించాడు.
నా కొడుకు జవవరి 5 నుంచి కనిపించకుండపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించారు. కానీ.. ఎందుకో ఆ బాలుడి తండ్రి ధర్మేష్ ప్రవర్తనపై పోలీసులకు కాస్త అనుమానం కలిగింది. దీంతో వెంటనే ఆ బాలుడి తండ్రి ధర్మేష్ ని విచారించారు. మొదట్లో ధర్మేష్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక పోలీసుల స్టైల్ లో విచారించే సరికి.. నా భార్యపై అనుమానంతోనే నా కుమారుడిని ఉరేసి చంపి చెరుకు తోటలో పడేశానని తెలిపాడు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ బాలుడి తండ్రి ధర్మేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.