ఎంత మంది ఎన్నిసార్లు దొరుకుతున్నా.. ఎంత మంది ప్రాణాలు పోతున్నా కూడా ఈ అక్రమ సంబంధాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రానురాను తప్పుడు సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య కూడా చాలా పెరుగుతోంది. అక్రమ సంబంధాలతో నేరాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. హత్యలు, కిడ్నాప్‌లు, దాడులు అన్నీ ఈ చీకటి బంధాల కారణంగానే వెలుగు చూస్తున్నాయి. తాజాగా భర్తలేడని ఇంట్లోనే దుకాణం పెట్టేసి.. ప్రియుడితో రంకు మొదలు పెట్టింది ఓ భార్య. అది కాస్తా భర్త కంట పడింది. ఆ తర్వాత అతను ఇద్దరినీ ఊర్లో చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ ఘర్ ప్రాంతంలో ఓ భార్య తప్పుడు పనులకు తెర లేపింది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి తన కామవాంఛలు తీర్చుకునేది. అలా కొన్నాళ్లు బాగానే సాగిపోయింది. ఎప్పటిలాగానే భర్త ఇంట్లోలేని సమయంలో ప్రియుడిని పిలిపించుకుంది. భర్తకు అనుమానమో.. లేక యాధృచ్ఛికమో చెప్పాపెట్టకుండా ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్యను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నాడు. ఆమె చేస్తున్న పని చూసి ఆ భర్త కోపంతో ఊగిపోయాడు.
వెంటనే ఆ ఇద్దరినీ బయటకు లాక్కాచ్చాడు. ఊరి మధ్యలో చెట్టుకు కట్టేశాడు. తమ బంధువులు చూస్తుండగా భార్య, ఆమె ప్రియుడిని చితక బాదాడు. అందుకు బంధువులు కూడా అడ్డు చెప్పలేదు. వాళ్లు కూడా భర్తకే మద్దతు ఇచ్చారు. దాదాపు రెండు గంటలపాడు ఆ భర్త తన కోపం మొత్తాన్ని భార్య, ఆమె రంకు మొగుడిపై తీర్చుకున్నాడు. అతని దెబ్బలు తాళలేక వారు చావు కేకలు పెట్టారు. వారి అరుపులు విని గ్రామస్థులు మొత్తం అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని ఇంకా రెండు తగిలించు అంటూ భర్తను సపోర్ట్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
భర్త కొడుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఆ విషయం చాలా లేటుగా పోలీసులకు చేరింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని విడిపించి పోలీసుస్టేషన్ కు తరలించారు. వారిపై దాడి చేసింది ఎవరు? ఎందుకు ఆ దాడి జరిగింది అనే ప్రశ్నలకు వారు సరైన సమాధానం చెప్పలేదు. ఎవరో దుండగులు వారిని అలా చెట్టుకు కట్టేసి కొట్టినట్లు చెప్పుకొచ్చారు. వారి రంకు విషయం బయటపడకూడదని అలా చెప్పారు. కానీ, విచారణ పోలీసులకు అసలు విషయం తెలిసింది. వారి మధ్య అక్రమసంబంధం ఉందని తెలిసి భర్తే అలా చెట్టుకు కట్టేసి కొట్టినట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు.

అసలు విషయం తెలుసుకున్న పోలీసులు భార్యాభర్తలు ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ భార్య తప్పుచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షిచకూడదన్నారు. భర్తపై కూడా కేసు నమోదు చేసి పీఎస్ కు తరలించారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
