ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్లు చివరికి విషాదంగా మారుతున్నాయి. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా యువతులు ప్రేమించినోడినే పెళ్లిళ్లు చేసుకోవడం, కాదంటే లేచిపోవడం వంటివి చేస్తున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను లెక్క చేయకుండా ప్రేమించిన యువకులతో వెళ్లిపోవడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. దీంతో వారిపై పగలు పెంచుకుని ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలే ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున రెండు జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవల తన కోడలు ప్రేమించిన యువకుడిని పెళ్లాడిందని మేనమామ విషమిచ్చి చంపాడు. ఇటీవల మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా రతన్ పురియా గ్రామం. ఇదే గ్రామానికి చెందిన ఓ బాలిక ఖార్చాయాఖేడీ ప్రాంతానికి చెందిన దేవీసింగ్ యువకుడితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించింది. ఇక కొన్నాళ్లపాటు వీరిద్దరు ప్రేమ విహారంలో తెలియాడుతున్నారు.
కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో యువకుడిపై తప్పుడు ఆరోపణలు సృష్టిస్తూ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడంటూ బాలిక కుటుంభికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని, బాలికను పిలిచి విచారించారు. ఇక పోలీసుల విచారణలో ఆ బాలిక అతనిని ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని తెగేసి చెప్పింది.
ఇది కూడా చదవండి: Kondapur: యువతిపై కిరాయి మనుషులతో అత్యాచారం చేయించిన మహిళ! వీడియోలు తీసి!
దీంతో ఇటీవల ఆ యువకుడితో ఆ బాలిక వెళ్లిపోయింది. దీంతో కోపంతో ఊగిపోయిన బాలిక కుటుంభికులు ఆ బాలికను యువకుడితో తిరగొద్దని, అతనిని మర్చిపోవాలని చెప్పారు. అయినా ఆ బాలిక ఎంతకు కూడా ఒప్పుకోలేదు. దీంతో తట్టుకోలేక పోయిన బాలిక మేనమామ కోడలికి విషమిచ్చి బలవంతంగా తాగించి చంపేశాడు. అనంతరం బాలిక ఆత్మహత్య చేసుకుందని మేనమామ వివరించే ప్రయత్నం చేశారు. ఇక పోలీసుల ఎంట్రీతో ఎట్టకేలకు మేనమామనే కోడలికి విషమిచ్చి చంపినట్లు తేలింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
