ప్రేమికులెప్పుడు ఏకాంతాన్నే కోరుకుంటారు. ప్రపంచానికి దూరంగా.. ఎవరికి తమ గురించి తెలియనంత దూరం వెళ్లి.. ఊసులాడుకోవాలని భావిస్తారు. తమ ఏకాంతానికి భంగం కలగని ప్రాంతానికి వెళ్లి.. ప్రేమలో ముగినిపోతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో బయటికెళ్లిన యువతికి అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆమె జీవితం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. యువతి-యువకుడు పీలేరులో స్తానికంగా ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండడం.. అందులోను క్లాస్ మేట్స్ కావడంతో అప్పుడప్పుడు బయటకు వెళ్లేవారు. అలానే వారం రోజుల క్రితం శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటుండగా మద్యం తాగిన నలుగురు యువకులు అటుగా వచ్చివారికి తెలియకుండా మొబైల్ ఫోన్లో వీడియోలు తీశారు. వారిని గమనించిన ప్రేమికులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడ్డుపడ్డ మందుబాబులు.. మేం చెప్పినట్లు చేయకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. వారిలో ఒకడు.. మందు తీసుకొస్తే విడిచిపెడతామని ప్రియుడికి చెప్పడంతో అతడు మద్యం తేవడానికి వెళ్ళాడు.
ఇది కూడా చదవండి : దారుణం.. గిరిజన యువతి పట్ల ఫారెస్ట్ గార్డ్ అమానుషం
దీనిని అదునుగా భావించి మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. తర్వాత ప్రియుడి సాయంతో ఇంటికెళ్లిన యువతి.. వారం రోజుల తర్వాత మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. అయితే తల్లిదండ్రులు తమకు న్యాయం అవసరం లేదని, ఇప్పటికే తమ కుటుంభం పరువు పోయిందని వదిలేయమని కోరడంతో పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తునట్లు సమాచారం.