నవ మాసాలు మోసి, పేగు తెంచుకుని ఆ తల్లి ఓ కొడుకుని కంటే.. ఆమె కుమారుడు మాత్రం తల్లిని ముసలి వయసులో సంతోషంగా చూసుకోవాల్సింది పోయి పెట్రోల్ పోసి కాల్చాడు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఈ ఘోరమైన చర్య స్థానికంగా సంచలనంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిషూర్ జిల్లా పున్న యురుకులం పరిధిలోని చెమ్మనూర్. ఇదే ప్రాంతంలో హలెక్కట్టిల్ వీట్టిల్(75) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు మనోజ్(53) అనే కుమారుడు కూడా ఉన్నాడు.
తాగుడుకు బానిసైన మనోజ్ ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉండేవాడు. ఇక మద్యానికి డబ్బులు లేకపోవడంతో మనోజ్ తరుచు తల్లిని వేధిస్తుండేవాడు. దీంతో కుమారుడి బాధను భరించలేని ఆ తల్లి అక్కడక్కడ తలదాచుకునేది. అయితే ఇటీవల కూడా మనోజ్ తల్లిని మరోసారి మద్యానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. లేవని తల్లి చెప్పడంతో మనోజ్ తల్లితో గొడవకు దిగాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని ఘోరానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై మనోజ్ కోపంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో ఏం చేస్తున్నాడో అర్థం కాని ఈ దుర్మార్గుడు.., ఇంట్లో ఉన్న కిరోసిన్ ను తల్లిపై పోశాడు. దీంతో వెంటనే నిప్పు అంటించుకుని తల్లిపై విసిరాడు.
దీంతో తల్లి మంటల్లో కాలి గొంతులు పగిలేలా అరిచింది. మహిళ అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే ఆ మహిళ ఉన్న ఇంట్లోకి వచ్చి మంటలను ఆర్పివేసి ఆ మహిళను రక్షించారు. ఇక 70 శాతం కాలిన ఆ మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.