హీరో నాగశార్య ఫాంహౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తాజాగా నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అనంతరం పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ తో పాటు అర్గనైజర్ సుమన్ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ఈ క్రమంలోనే తన బెయిల్ పిటిషన్ ను శివలింగ ప్రసాద్ దాఖలు చేయటం విశేషం. ఇక విచారణ అనంతరం ఉప్పర్ పల్లి కోర్టు శివలింగ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేసింది.
ఇక నాగ శౌర్య ఫ్యామిలీ నగర శివారులోని మంచిరేవులు సమీపంలో ఓ ఫాంస్ ను లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి అప్పుడప్పుడు నాగశౌర్య వెలుతుండటం చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలోనే నాగశార్య ఫాంహౌస్ లో సుమాన్ అనే వ్యక్తితో పాటు చాలా మంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక వెంటనే పోలీసులు హాటాహుటిన అక్కడికి చేరుకుని అనుమానితులను అరెస్ట్ చేశారు.
