ఆడ పిల్లలు ఉన్న కుటుంబాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో సంపాదించటం కంటే.. సంపాదించిన దాన్ని సరిగ్గా ఖర్చు చేయటం లేదా పొదుపు చేయటమే క్లిష్టంగా మారింది. సంపాదనలో కొంత మిగులుతున్నా.. దాన్ని ఎలా దాచాలి.. ఎక్కడ దాస్తే మంచిది అన్న విషయాలు తెలియక చాలా మంది మధన పడుతూ ఉంటారు. ఆడ పిల్లలు ఉన్న వారు అయితే.. పొదుపు చేయకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకే.. ఆడ పిల్లలు ఉన్న వారు పొదుపు తప్పని సరిగా అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వ పథకాల్లో నెలనెల పొదుపు చేస్తూ ఉండాలి. ఆడపిల్లలు ఉన్న కుటుంబం కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకమే.. సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీము పోస్టాఫీసుల్లోనూ..
బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులను పొదుపు చేయటం వల్ల పలు రకాల లాభాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీము పదేళ్ల లోపు వయసు గల అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఇంట్లోని ఇద్దరు అమ్మాయిల పేరు మీదే ఈ స్కీముపై ఖాతాలు తెరవటానికి వీలుంటుంది. 250 రూపాయలతో కూడా ఈ స్కీములో చేరొచ్చు. ఈ స్కీములో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీము మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లుగా ఉంది. ఖాతా తెరిచిన వారు కనీసం 15 ఏళ్ల పాటు డబ్బులు పొదుపు చేయాలి. ఏడాదిలో గరిష్టంగా 1.5 లక్షలు పొదుపు చేయోచ్చు.
రోజుకు 50 పొదుపు చేస్తే.. నెలకు అది 1500 అవుతుంది. అది మెచ్యూరిటీ సమయానికి 8 లక్షల రూపాయలు అవుతుంది. అదే రోజుకు 100 పొదుపే చేస్తే .. నెలకు 3 వేలు అవుతుంది. అది మెచ్యూరిటీ సమయానికి 16 లక్షల రూపాయలు అవుతుంది. ఇక, కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును మూడు నెలల కోసారి సమీక్షిస్తూ వస్తోంది. సుకన్య సమృద్ధి యోజనలో చేరటం వల్ల టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సంవత్సరంలో 1.5 లక్షల రూపాయల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. మరి, సుకన్య సమృద్ధి యోజన స్కీముపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.