ఉన్నపళంగా సొంతింట్లో అడుగుపెట్టాలనేది మీ కల అయితే.. ఆ కలను కేవలం రూ. 3 లక్షలకే నిజం చేసుకునే అవకాశాన్ని శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ కల్పిస్తుంది. మీరు విన్నది నిజమే. మీరు కనుక రూ. 3 లక్షలు చేతిలో పెట్టిన వెంటనే గృహ ప్రవేశం చేయాలి అనుకుంటే కనుక ఇదే మంచి ముహూర్తం.
సాధారణంగా ఏ ప్రాజెక్ట్ అయినా వెంటనే ఇంటిని అప్పజెప్పడం అనేది జరగదు. కోటి రూపాయల విలువైన ఇల్లు కొనేటప్పుడు కూడా రూ. 30 లక్షలు అడ్వాన్స్ అనేది కట్టాలి. అప్పటికి కూడా ఇల్లు అనేది మన చేతికి ఇవ్వరు. వెంచర్ ని స్టార్ట్ చేసి పూర్తయ్యాక ఇస్తారు. అందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఒక్కోసారి ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. అంటే ఒక ఇల్లు మన చేతుల్లోకి రావాలంటే కొన్ని నెలలు ఎదురుచూడాలి. ముందు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. తర్వాత వెంచర్ స్టార్ట్ చేసి కొన్ని నెలల తర్వాత అప్పజెప్పడం జరుగుతుంది. పోనీ ఆ తర్వాత అయినా వెంటనే గృహప్రవేశం చేయడానికి ఉంటుందా అంటే ఉండదు.
ఎందుకంటే నచ్చినట్టు ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి. దానికి అదనంగా కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా తక్కువ అడ్వాన్స్ తో ఇల్లు లేదా ప్లాట్ బుక్ చేసుకుని వెంటనే లగ్జరీ ఇంట్లో అడుగు పెట్టవచ్చు. ఏంటి నమ్మశక్యంగా లేదా? ఇల్లు ఖరీదులో సగం అడ్వాన్స్ ఇస్తేనే గానీ ఇంటి నిర్మాణం మొదలుపెట్టరు, పూర్తిగా డబ్బు కడితేనే గానీ ఇంటి తాళాలు చేతికివ్వరు. అలాంటిది తక్కువ అడ్వాన్స్ సొమ్ముతో విలాసవంతమైన ఇంట్లో అడుగుపెట్టనిస్తారా? అని సందేహించకండి. ఇది నిజం. శిల్ప కల్ప వృక్ష గేటెడ్ కమ్యూనిటీ సామాన్యుల కలలను నిజం చేస్తుంది.
హైదరాబాద్ నుంచి మెదక్ హైవేకి మెయిన్ ఫేసింగ్ లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. 15.5 ఎకరాల్లో 10 టవర్స్ తో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో 1576 ఫ్లాట్ లు ఉన్నాయి. 65 రకాల సౌకర్యాలను అందిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, పార్క్ ఏరియా, 24/7 వాటర్ సప్లై, పవర్ బ్యాకప్, సెక్యూరిటీ వంటి సదుపాయాలు ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా మామూలే. కానీ వీటితో పాటు పిల్లల కోసం వాలీబాల్, క్రికెట్, టెన్నిస్ వంటి ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ సదుపాయాలను కల్పిస్తున్నారు. ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. కానీ ఈ శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్మూనిటీకి వచ్చేసరికి రెండు ఎంట్రీలు ఉంటాయి. అదే దీని ప్రత్యేకత.
ఇక వెంటిలేషన్ కోసం ప్రతీ టవర్ ని యు షేప్ లో నిర్మించారు. అలానే ఇంటికొక చెట్టు కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. ఈరోజుల్లో కాలుష్యం పెరిగిపోయింది. మంచి గాలి అనేది కరువైంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఆక్సిజన్ అని 1576 ఫ్లాట్స్ కి 1576 చెట్లను ఈ ప్రాజెక్ట్ లో కీలకం చేశారు. ఇది నిజంగా చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. లగ్జరీ క్లబ్ హౌసెస్ కూడా ఉన్నాయి. టూ లెవల్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. మెడికల్ ఫార్మసీ, బ్యూటీ సెలూన్, పాల కేంద్రం, సూపర్ మార్కెట్, ఏటీఎం లాంటి సదుపాయాలు చాలా ఉన్నాయి.
శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్మూనిటీలో 1576 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో 2 బీహెచ్‌కే, 2.5 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 925 చదరపు అడుగుల నుంచి 1289 చదరపు అడుగుల వరకూ ఫ్లాట్ ఏరియా అనేది ఉంటుంది. బయట గేటెడ్ కమ్మూనిటీస్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ స్పేస్ ఇస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఎకరంలో 100 ఫ్లాట్స్ చొప్పున 15.5 ఎకరాల్లో 1576 ఫ్లాట్స్ మాత్రమే నిర్మించారు. యాక్చువల్ గా ఒక ఎకరంలో 150 ఫ్లాట్స్ ని కట్టవచ్చు కానీ కస్టమర్స్ కి విశాలమైన లివింగ్ స్పేస్ ని ఇవ్వాలన్న ఉద్దేశంతో శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ విశాలమైన లగ్జరీ ఫ్లాట్స్ ని అందిస్తున్నారు.
శిల్ప కల్పవృక్ష స్కీం ప్రకారం లోన్ ఈఎంఐ అనేది నెలకు ఇంత అని ఉంటుంది. ఆ స్కీం ప్రకారం 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసి సొంతింట్లో అడుగు పెట్టేయవచ్చు. శిల్ప కల్పవృక్ష పేరుకి తగ్గట్టే ఇందులో ఫ్లాట్లు శిల్పాలు చెక్కినట్టు ఉంటాయి. ఇక కల్పవృక్ష అంటే కోరిన వరాలు ఇచ్చే చెట్టు. ఈ శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ కూడా కస్టమర్స్ కోరుకునే సదుపాయాలు మాత్రమే కాకుండా కస్టమర్లు ఊహించనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తుంది. శిల్ప కల్పవృక్ష.. సామాన్యుల కలలను నిజం చేస్తుంది. మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే లగ్జరీ ఫ్లాట్ మీ సొంతం. ఏ వెంచర్ కి వెళ్లినా వెంటనే ఇల్లు అయితే అప్పజెప్పరు. పైగా అడ్వాన్స్ ఎక్కువ చెల్లించాలి. కొన్ని నెలలు వెయిట్ చేయాలి. దీని వల్ల ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దె, అప్పు వడ్డీ రెండిటి భారం ఉంటుంది. అదే శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కుంటే అద్దె భారం ఉండదు. ఆ డబ్బుతో హోమ్ లోన్ ఈఎంఐ కట్టుకోవచ్చు. మరి సొంతింటి కలను నిజం చేసుకోవడానికి మీరు సిద్ధమేనా?