మంచి మార్కులతో పాస్ అయి.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి.. ప్రజెంట్ డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ పొందితే కానీ.. మంచి ఉద్యోగం లభించదు. ఏదో అరకొర చదువులు చదివి.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే.. చాకిరీ ఎక్కువ.. సాలరీ తక్కువ వచ్చే ఉద్యోగాలే దొరుకుతాయి. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే పెట్టుబడి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అంత ఆర్థిక స్థోమత లేదు.. మరేం చేయడం… అలాంటి వారి కోసం మార్కెట్ నిపుణులు అతి తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల గురించి వివరిస్తున్నారు. ఈ వ్యాపారాలకు పెట్టుబడి తక్కువ. కానీ నమ్మకంగా.. నిజాయతీగా కష్టపడి పని చేస్తే.. తక్కువ సమయంలోనే మంచి లాభాలు పొందవచ్చని వివరిస్తున్నారు. ఆ వివరాలు..
మరీ ముఖ్యంగా మహిళలు.. తమకు ఉన్న ఖాళీ సమయంలో ఏదైనా వ్యాపారం చేసి.. డబ్బులు సంపాదించి.. కుటుంబానికి ఆసారాగా నిలవాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఇంట్లోనే ఉండి.. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ ఐడియాల గురించి ఇక్కడ తెలుసుకుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పే బిజినెస్ ఐడియాలు డోర్ మ్యాట్స్ తయారు చేయడం. ఈ వ్యాపారం చేయాలనుకునే వారికి టెక్స్టైల్ వేస్ట్, డోర్ మ్యాట్స్ వేవింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. వీటికి సుమారు 30-40 వేల రూపాయల ఖర్చు అవుతుంది. దీనికి లేబర్‌తో పని లేకుండా మనమే స్వయంగా డోర్ మ్యాట్స్ తయారు చేయవచ్చు. మనకు రాకపోతే.. డోర్ మ్యాట్స్ మెషనరీ అమ్మే వాళ్లు ట్రైనింగ్ ఇస్తారు. అలా మనమే సొంతంగా డోర్ మ్యాట్స్ తయారు చేయవచ్చు. దీనిలో రిస్క్ తక్కువ.. లాభం ఎక్కువ. కాకపోతే మార్కెటింగ్ చేసుకునే చిట్కాలు తెలిసి ఉండాలి.
ఆ తర్వాత.. మరో బిజినెస్ ఐడియా.. ఇంటి భోజనం. రెస్టారెంట్లు, హోటళ్లు ఎన్ని వచ్చినా ఇంటి భోజనానికే మొదటి ఓటు వేస్తారు. అసలే ఇవి ఉరుకుల పరుగుల జీవితాలు. వండుకునే తీరక, ఓపిక రోజు రోజుకు తగ్గిపోతుంది. దీన్ని సరిగా వినియోగించుకోగలిగితే.. మంచి వ్యాపార మార్గం అవుతుంది. రుచిగా, నాణ్యమైన, శుభ్రమైన భోజనం.. సమయానికి అందించగలిగితే.. ఎలాంటి మార్కెటింగ్ లేకుండానే.. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా.. అనతి కాలంలోనే మీ వంటకు.. తద్వారా బిజినెస్‌కు డిమాండ్ పెరుగుతుంది. మీకు ఉండే ఖాళీ సమయాన్ని బట్టి దీన్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్ మాత్రమే అందివ్వగలరా.. లేక మూడు పూటలా అందివ్వగలరా అనే విషయాన్ని ఆలోచించుకుని.. అడుగుపెట్టాలి.
అయితే ఏ వ్యాపారం ప్రారంభించాలన్న.. ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకుని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే రంగంలోకి దిగాలి. అయితే ఏ వ్యాపారం అయినాసరే ప్రారంభించగానే లాభాలు రావు. పట్టుదలతో.. కష్టపడి పని చేస్తే.. త్వరలోనే విజయం సాధించవచ్చు. పైగా పైన చెప్పిన వ్యాపారాలకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కనుక మీకు ఆసక్తి ఉంటే.. పూర్తిగా తెలుసుకుని ప్రయత్నించండి.