రిలయన్స్ జియో యూజర్లకోసం అదిరిపోయే ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో అద్భుతమైన ప్రయోజనాలు అందించనుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇండియాలోని టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. జియో నెట్ వర్క్ ను ప్రవేశపెట్టి మిగతా టెలికాం సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేసింది. తక్కువ ధరకు ఇంటర్నెట్ ను అందించడంలో కీలకంగా వ్యవహరించింది. అద్భుతమైన ప్లాన్ లను ప్రవేశపెట్టి కోట్లాదిమంది కస్టమర్లను సొంతం చేసుకుంది. టెలికాం రంగంలో ప్రవేశించిన తక్కువ సమయంలోనే జియోకు విశేషమైన ఆదరణ లభించింది. కాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సంవత్సరం వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ను వినియోగించుకున్న వారికి రూ. 5,800 విలువచేసే కూపన్లను ఉచితంగా అందిస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ.2999 రీఛార్జి ప్లాన్ ను జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీచార్జీతో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకున్న యూజర్లకు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు, రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీని అందిస్తుంది. దీంతో పాటు జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీని సంవత్సర కాలం పాటు ఫ్రీగా వీక్షించవచ్చు. ఇక ఈ ప్లాన్ తో అదనపు ప్రయోజనాలను కూపన్ల రూపంలో పొందవచ్చు. అవేంటంటే..
*ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో రూ.240 కంటే ఎక్కువ ధరతో ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ.100 డిస్కౌంట్ లభిస్తుంది.
*యాత్రలో ఫ్లైట్ బుక్ చేసుకుంటే రూ.1500 డిస్కౌంట్, హోటళ్లలో రూ.4 వేల కంటే ఎక్కువ చెల్లిస్తే అందులో 15 శాతం వరకు రాయితీ పొందవచ్చు.
* అజియోలో రూ.999 కొనుగోలుపై రూ.200 రాయితీ లభిస్తుంది.
*నెట్‌మెడ్స్ ద్వారా రూ.999 కి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
*రిలయన్స్ డిజిటల్‌లో కొన్ని ఎంపిక చేసిన ఆడియో, గృహోపకరణాలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది.