దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ పేమెంట్స్ యుగం మొదలైంది. కరోనా కారణంగా ఇవి మరింత ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా .. గూగుల్ పే, ఫొన్ పే వంటి ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. పేమెంట్స్ యాపులు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ Google Pay కూడా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) ఫీచర్ కలిగి ఉన్న వారి కోసం ట్రాన్సక్షన్‌లను సులభం చేయడానికి ట్యాప్-టు-పే ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది.
స్టోర్లు, షాపింగ్ మాల్ లో ఉపయోగించే కార్డ్ మెషీన్లలోని పాయింట్ ఆఫ్ సేల్(POS) టెర్మిన్‌లను.. స్మార్ట్ఫోన్లతో ట్యాప్ చేయడం ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దీని వలన షాపింగ్ మాల్స్, స్టోర్లలో క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సిన అవసరం ఉండదని, అలాగే డిజిటల్ చెల్లింపులు సులభంగా ఉంటాయని Google Pay బిజినెన్ హెడ్ సజిత్ శివానందన్ తెలిపారు. గూగుల్ పే.. పైన్ ల్యాబ్స్‌తో కలిసి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ప్రత్యేకించి కాంటాక్ట్స్ డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పైన్ ల్యాబ్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కుష్ మెహ్రా చెప్పారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఇళ్లు కట్టుకోవడానికి హోమ్ లోన్ తీసుకోవడం మంచిదేనా?