‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసినా.. షో వల్ల మొదలైన ఫ్యాన్ వార్ మాత్రం ఇంకా ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా ఇంకా బలంగా కొనసాగుతోంది. తొలుత షణ్ముఖ్ జశ్వంత్ విన్నర్ అని ఫ్యాన్స్ తో సహా చాలా మంది భావించారు. ఆ తర్వాత సన్నీ పుంజుకోవడం, ఒకరికొకరు పోటీ కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మొదలైంది. కొన్నాళ్లు హ్యాష్ టాగ్ లతో కొట్టుకున్నారు. వైరల్ ట్వీట్స్ తో రికార్డులు కూడా సృష్టించారు.
సన్నీ విన్నర్ అయ్యాడు అని అనధికారిక వార్తలు వచ్చిన తర్వాత షణ్ముఖ్ ఫ్యాన్స్- సన్నీ ఫ్యాన్స్ మధ్య రచ్చ మరింత ముదిరింది. సోషల్ మీడియా వార్ కాస్తా.. బిగ్ బాస్ సెట్ దగ్గర భౌతిక దాడులు చేసుకునే వరకు వచ్చింది. కంటెస్టెంట్లు తీసుకున్నంత స్పోర్టివ్ గా ఫ్యాన్స్ తీసుకోలేక పోవడం బాగా మైనస్ అయ్యింది. పెద్దఎ్తతున సన్నీ ఫ్యాన్స్- షణ్ముఖ్ ఫ్యాన్స్ చేరుకుని హల్ చల్ చేశారు. అంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా షణ్ముఖ్ విన్నర్ కాలేకపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.
ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య పోటీ నెలకొన్నప్పుడు వారి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సహజం. అది ముఖ్యంగా సోషల్ మీడియాలోనే జరుగుతుంటాయి. కానీ, వీరిద్దిరి విషయంలో మాత్రం అది కాస్త శ్రుతి మించిందనే చెప్పాలి. భౌతిక దాడుల వరకు చేరుకుందని తెలిసి ప్రేక్షకులు సైతం షాకయ్యారు. సోషల్ మీడియాలో జరిగినంత సేపు వారి వార్ ను ఆస్వాదించిన ప్రేక్షకులు.. నేరుగా యుద్ధానికి దిగడం చూసి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలా కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సన్నీ ఫ్యాన్స్ Vs షణ్ముఖ్ ఫ్యాన్స్ విషయంలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
