‘బిగ్ బాస్ 5 తెలుగు’ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంత అలరించిందో పక్కన పెడితే అందులోని కొందరు కంటెస్టెంట్లను మాత్రం బాగానే ఇబ్బంది పెట్టింది. వారిలో షణ్ముఖ్, సిరిలు ప్రధానంగా ఆ ఎఫెక్ట్ ను ఫేస్ చేస్తున్నారు. లోపల ఉన్నంతసేపు ఏమీ తెలియలేదు.. కానీ బయటకు వచ్చాక వస్తున్న కామెంట్స్, ట్రోల్స్ చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఇప్పుడు వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సిరి హన్మంత్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇది కూడా చదవండి: నీ మనసాక్షితోనైనా నిజాయితీగా ఉండు! దీప్తీ సునైనా పోస్ట్ వైరల్!
ప్రతి ఒక్కరు హగ్గుల గురించే మాట్లాడుతున్నారు అంటూ సిరి ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా అమ్మి వచ్చి హగ్గులు మానుకో అనగానే నేను ఆపేస్తే నేను అప్పటి వరకు చేసింది తప్పే అవుతుంది. అది కూడా నా అంతట నేనే ఒప్పుకున్నట్లు అవుతుంది. అసలు లోపల జరిగేది ఏంటో మా అమ్మకు వివరించాను. షణ్ముఖ్ నన్ను ఎలా చూసుకున్నది చెప్పాను. అప్పుడు మా అమ్మ కూడా తాను అలా అని ఉండకూడదని భావిచింది. తర్వాత నేను షణ్ముఖ్ ఇద్దరం మాట్లాడుకున్నాం. ఒక క్లారిటీకి వచ్చాం.
నేను చేసింది ప్రేక్షకులకు నచ్చకపోతే నన్ను క్షమించండి. నేను నా జీవితంలో అన్ని కామెంట్స్ ఎప్పుడూ చూడలేదు. ఓట్లు వేసినప్పుడు స్వీకరించి.. కామెంట్స్ ను రిసీవ్ చేసుకోకపోతే తప్పే అవుతుంది. నేను ఆ కామెంట్స్ ను కూడా స్వీకరిస్తాను. మాలో నిజంగానే చెడు ఉద్దేశమే ఉంటే.. కెమెరాల ముందు ఎందుకు అలా చేస్తాం? కెమెరాలు లేని చోట చేస్తాం కదా? నేను బయట కూడా షణ్ముఖ్ తో మంచి ఫ్రెండ్ లాగానే ఉంటాను’ అంటూ సిరి హన్మంత్ ఎమోషనల్ గా తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలు, బ్యాడ్ కామెంట్స్ కు సమాధానం చెప్పింది. సిరి హన్మంత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.