‘సోనూ సూద్’ రీల్ విలన్ కాస్తా.. కరోనా విపత్కర పరిస్థితుల్లో రియల్ హీరోగా మారిపోయాడు. ఎందరో వలస కూలీలను ఇంటికి చేర్చడం మొదలు.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆపన్న హస్తం అందిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను పొందాడు. ఎవరికి కష్టం వచ్చినా.. సోనూసూద్ ఉన్నాడు మమ్మల్ని ఆదుకుంటాడు అనే నమ్మకాన్ని పొందగలిగాడు. ఒక పెద్ద టీమ్ ను ఏర్పాటు చేసుకుని తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా తనకు ఒక్కరోజులోనే కొన్ని వేల రిక్వెస్టులు వస్తున్నాయంటే నమ్ముతారా? అంతలా ప్రభావం చూపాడు. ఇప్పుడు సోనూసూద్ పేరు మరో విషయంలో వైరల్ అవుతోంది. తెలుగులో మాట్లాడుతూ సోనూసూద్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ గా మారింది.
From the superhero @SonuSood to our hero.
keep your eyes on the stars and feet on the ground is what
Sonu Sood taught us and we can see #Sreeram follow it.Thankyou for the support pic.twitter.com/Bk8QExQRfd
— Sreerama Chandra (@Sreeram_singer) November 9, 2021
‘బిగ్ బాస్ 5 తెలుగు’లో తన సపోర్ట్ ఎవరికో సోనూసూద్ చెప్పేశాడు. ‘మీరు బిగ్ బాస్ 5 తెలుగులో సింగర్ శ్రీరామ్ ను చూస్తున్నారా? నేను చూస్తున్నాను. లాట్స్ ఆఫ్ లవ్ బ్రో, కీప్ సపోర్టింగ్ సింగర్ శ్రీరామ్’ అంటూ సోనూసూద్ తెలుగులో మాట్లాడి అందరినీ అలరించాడు. మరోవైపు తన సపోర్ట్ సింగర్ శ్రీరామ్‌కే అనే విషాన్ని వెల్లడించాడు. శ్రీరామచంద్ర హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడు. ఇంట్లోని సభ్యులకు మంచి పోటీ ఇవ్వగలడు. టాప్ 5 కంటెస్టెంట్ అని కూడా టాక్ సంపాదించాడు. మొదటి వారాల్లో ఎంతో సైలెంట్ గా ఉన్న శ్రీరామ్ గత కొన్ని వారాలుగా టాప్ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. అతని క్యారెక్టర్, ఆటీట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మరి, రియల్ హీరో సోనూసూద్ సపోర్ట్ ఎంత వరకు సింగర్ శ్రీరామ్‌కు ఉపయోగపడుతుందో చూడాలి.
Mana Sreeramudu entha muchataga unnado 😍
.
.
.#TeamSreeramaChandra #Sreeram #SreeramaChandra #SRC #biggboss5telugu #Gamechanger #biggbosstelugu5 pic.twitter.com/bLPe2qeZtY— Sreerama Chandra (@Sreeram_singer) November 9, 2021
