‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఎమోషన్స్ పండిపోతున్నాయి. అందరూ ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు బాగా ట్రై చేస్తున్నారు. ఇంకా ఉండేది మూడు వారాలే కాబట్టి వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నారు. ప్రతివారం లానే ఈ వారం కూడా హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. హౌస్ లో లాస్ట్ వీక్ కెప్టెన్ మానస్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఆదివారం రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో తెలుస్తుంది. కానీ ప్రియాంక మాత్రం ముందే జోతిష్యం చెబుతోంది. ఎలిమినేట్ అయ్యేది తానేనని ఫిక్స్ అయ్యి మానస్ కు జాగ్రత్తలు కూడా చెబుతోంది.
హౌస్ లోని చివరి క్షణాలను మానస్ తో కలిసి గడపాలని ప్రయత్నిస్తోంది ప్రియాంక. ఎందుకంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తానేనని ఫిక్స్ అయిపోయింది. అందుకు మెంటల్ గా తనని తాను సిద్ధం చేసుకుంటోంది. భోజనం చేస్తూ మానస్ తో కలిసి మాట్లాడింది. ‘రోజూ నైట్ పడుకునేటప్పుడు బొట్టు పెట్టుకో.. రోజూ పెరుగన్నం, బనాన తిను. బట్టలు ఉతికేసుకో’ అంటూ ఏవేవో చెబుతోంది. అందుకు మానస్ ‘నువ్వేం వెళ్లిపోవులే.. ఎందుకు అలా ఫిక్స్ అవుతున్నావ్? ఇప్పటికే ఎక్కువ రోజులు ఉన్నావని ఫీల్ అవుతున్నావా?’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. మానస్‌కు ప్రియాంక మీద ఫీలింగ్స్ లేవని అందరికీ తెలుసు. ఒక ఫ్రెండ్ లా మాత్రమే చూస్తున్నాడని. కానీ, ప్రియాంక మాత్రం ఫీలింగ్స్ పెంచేసుకుని అలా బిహేవ్ చేసింది.
ఈవారం మాత్రం ప్రియాంక సింగ్ నే ఎలిమినేట్ అయ్యేది అని బయట టాక్ బాగా వినిపిస్తోంది. మరి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయితే మానస్ ఎలా రియాక్ట్ అవుతాడు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.