‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో ఆట మంచి రసవత్తరంగా సాగుతోంది. మంచి ట్విస్టులు, ప్రతి సీన్ క్లైమాక్స్ తరహా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం ‘అభయహస్తం’ కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో అందరూ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. మొదటిసారిగా షణ్ముఖ్ కెప్టెన్సీ పోటీదారు అయ్యి ఆకట్టుకున్నాడు. మరోవైపు హౌస్‌లో మానస్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. బయట కూడా మానస్‌కు సపోర్టర్స్ పెరిపోతున్నారు. అతని గేమ్ కుడా బాగా ఆకట్టుకుంటోంది. మొదటి నుంచి మానస్ గేమ్ ఏమాత్రం ఛేంజ్ కాలేదంటూ.. అప్పుడు ఇప్పుడు మానస్ అదే గేమ్ కొనసాగిస్తున్నాడంటూ టాక్ బాగా వినిపిస్తోంది. రాను రాను మానస్ కు ఆదరణ కూడా పెరుగుతోంది.
బయట ప్రేక్షకులే కాదు.. ఇంట్లోని సభ్యులు కూడా మానస్ ఆటకు ఎప్పుడో ఫిదా అయిపోయారు. పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవడంలో మానస్ ముందుంటాడు. నమ్మిదే చేస్తాడు మానస్. ఎక్కడా కాంప్రమైస్ అయినట్లు కనిపించడు. ఇప్పుడు మానస్ కెప్టెన్ అవుతాడేమో అని బయటనున్న అభిమానులు చెప్పడం కాదు లోపలున్న కంటెస్టెంట్లే చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా బిగ్ బాస్ టైటిల్ కొట్టేది మానస్ అంటూ ప్రియాంక చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఉన్న వారిలో మానసే విన్నర్ అవుతాడంటూ పింకీ చెప్పేస్తోంది. ఆమె అన్న మాటలను కొట్టి పారేయలేం. ఎందుకంటే 24 గంటలు చూస్తుండే ఆమె అలా అనడం అంటే అది జోక్ గా తీసుకోవడానికి లేదు. మరి, పింకీ కామెంట్లతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.