‘బిగ్ బాస్ 5 తెలుగు’ రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. విశ్వ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ వారం నామినేషన్స్ లో సన్నీ, సిరి, రవి, మానస్, కాజల్ ఉన్నారు. వారిలో ఎవరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడం ఆ ఉత్కంఠకు కారణం. బిగ్ బాస్‌లో ప్రస్తుతం ఉన్న క్యూట్ కపుల్ ఎవరూ అంటే మానస్- ప్రియాంక అని టక్కున చెప్పేస్తారు. ఏ విషయంలోనైనా పింకీ మానస్ చుట్టూనే ఉంటుంది. బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అన్నా కూడా మానస్ అని చెప్పేస్తుంది. వారి మధ్య ఉన్న బాండింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదే తడవుగా అందరూ వారిని లవర్స్ అంటూ ప్రచారాలు ప్రారంభించారు. ఈ అంశంపై మానస్ తల్లి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
మానస్- ప్రియాంక సింగ్ రిలేషన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ప్రియాంక సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మానస్ కు మంచి ఫ్రెండ్ తను. బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్స్ అంతవరకే అని అందరికీ తెలుసు. ఇప్పటి వరకు హౌస్ లో ప్రేమికులు, జంటలుగా ఉన్న వాళ్లు బయటకి వచ్చి పెళ్లిళ్లు చేసుకున్నారా?. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అది కేవలం 110 రోజుల ఆట మాత్రమే. ఆ విషయం హౌస్ లో ఉన్న అందరికీ తెలుసు’ అంటూ మానస్ తల్లి పద్మిని సమాధానమిచ్చారు.
ఇక మానస్ పెళ్లి విషయంలోనూ పద్మిని క్లారిటీ ఇచ్చేశారు. ‘నేను వేలు చూపించి ఎవరిని చేసుకో మంటే మానస్ వాళ్లను పెళ్లి చేసుకుంటాడు. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. ప్రియాంక సింగ్ తో నా కొడుకు వివాహం చేయను. ఆమె అంటే చాలా ఇష్టం. ఆమెకు దగ్గరుండి వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాను. ఏ సహాయం కావాలన్నా.. చేస్తాను’ అంటూ పద్మిని కుండ బద్దలు కొట్టేశారు. మానస్ ఫస్ట్ లవ్ గురించి కూడా ప్రస్తావించారు. ‘చదువుకునే వయసులో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఏం చేయాలని నన్ను అడిగితే నీది చిన్న వయసు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అని చెప్పాను’ అంటూ మానస్ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు.
మరోవైపు ప్రియాంక ప్రవర్తన చూసి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మానస్ అంటే పిచ్చి ప్రేమను పెంచుకుంటోంది. ఆట అయ్యాక అలా మానస్ తో కలిసి ఉండలేదు, మాట్లాడలేదు అప్పుడు ఎలా ఉండగలదు అంటూ అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రియాంకకు మంచి ఫాలోయింగ్ డెవలప్ అయ్యింది. మానస్- ప్రియాంక సింగ్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.