‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ట్రాక్ లు, జంటలు అని చాలా మందే ఉన్నారు. కానీ, క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకుంది మాత్రం ప్రియాంక- మానస్ లు మాత్రమే. మానస్ తనను ఒక ఫ్రెండ్ లాగే చూసినా.. పింకీ మాత్రం మొదటి రోజు నుంచి అతనిపై ఫీలింగ్స్ పెంచుకుంది. మొదట మానస్ గట్టిగా చెప్పలేకపోయినా.. నాగార్జున, అతని తల్లి చెప్పిన మాటలు విని ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేశాడు.
అప్పటి వరకు తాను పెంచుకున్న ఫీలింగ్స్ ను ఎలా చెప్పాలో తెలీక మానస్ ముందు పెట్టేసింది. ఆ తర్వాత వారి మధ్య దూరం పెరగటం చూశాం. కాజల్ తో మానస్ అన్న మాటలు బిగ్ బాస్ బజ్ లో విని పింకీ కన్నీటి పర్యంతం అయ్యింది. ఆ తర్వాత ఇక పింకీ మానస్ జోలికి వెళ్లదు అనే అందరూ ఫిక్స్ అయిపోయారు. అంత జరిగినా కూడా బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ ఎవరూ అంటే మానస్ అవ్వాలని కోరుకుంది.
అదే షాక్ అనుకుంటే.. ఇప్పుడు బయట పింకీ చేస్తున్న పనికి నెటిజన్లు షాకవ్వడమే కాదు.. ఫిదా అయిపోయారు. ఓట్ ఫర్ మానస్ అంటూ పెద్దఎత్తున క్యాంపైన్ చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఆమె చేస్తున్న సపోర్ట్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మానస్ మనసులో మాట తెలుసుకున్న తర్వాత కూడా పింకీ అలా ఎలా చేయగలుగుతోందని? ప్రశ్నిస్తున్నారు.
ఒక వ్యక్తి మన గురించి తప్పుగా మాట్లాడారు అని తెలిస్తే వారి ఊసు కూడా ఎత్తం కదా.. మరి గెలిపించండి అని ఎలా అడుగుతోందని ఆశ్యర్యపోతున్నారు. ఇంకొందరైతే ‘ప్రేమ అంటే ఇవ్వడం.. ఆశించడం కాదంటూ’ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ పనితో ప్రియాంక మాత్రం అభిమానుల హృదయాల్లో మంచి స్థానాన్ని పొందింది. ప్రియాంక చేస్తున్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.