‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ఎండ్ కొచ్చేసింది. టాప్ 5 కోసం పోటీ పడుతున్నారు. అయితే తాజాగా ప్రియాంక సింగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ బజ్ లో ప్రియాంకకు చూపించిన ఒక వీడియో ఇప్పుడు మానస్ పై ఆమెకున్న ఒపీనియన్ మొత్తాన్ని మార్చేసింది అనే చెప్పాలి. అప్పుడు ప్రతి లైన్ లో మానస్ అనే పేరు లేకుండా మాట్లాడేది కాదు. ఇప్పుడు అసలు మానస్ అంటేనే పడే పరిస్థితి లేదు. ఆ వీడియో తర్వాత పింకీ బిహేవియర్ లో చాలా మార్పు గమనించవచ్చు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కూడా అందుకు అద్దం పడుతున్నాయి. బజ్ లోనూ తాను కన్నీళ్లు పెట్టుకుంది. ఒక చంటి పిల్లాడిలా మానస్ ను చుసుకున్నానని చెప్పుకొచ్చింది.
మానస్ ప్రియాంక విషయంలో తన బిహేవియర్ మార్చుకోవడం. కాజల్ తో ఎక్కువ సమయం గడుపుతుండటం. పింకీని అవాయిడ్ చేయడం ఆమెను ఎమోషనల్ గా బాగా డిస్ట్రబ్ చేశాయి. అయితే గేమ్ కోసమే అలా దూరం పెట్టాడు అనుకున్న ప్రియాంకకు మానస్ వీడియో చూశాక ఆమెపై మానస్ కు ఉన్న ఒపీనియన్ ఏంటో క్లారిటీ వచ్చింది. అందుకే మానస్ గురించి ప్రస్తావించగానే మానస్ గురించి అడగొద్దంటూ కాస్త సీరియస్ అయ్యింది. అంతే కాదు అతను నాకు మంచి మిత్రుడు అంటూ చెప్పింది. ఆ సమయంలో ఆమె ఎక్స్ ప్రెషన్ చూసి అందరూ ఫిక్స్ అయిపోయారు. మానస్ పై ప్రియాంక అభిప్రాయం మారిపోయిందని. మానస్ అందరినీ చదివేసి పక్కన పడేస్తాడు అనే కామెంట్ కూడా దానికి బలం చేకూరుస్తోంది. ప్రియాంక- మానస్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.