‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ దాదాపు ముంగిపు దశకు చేరుకుంది. ఇంట్లో ఏడుగురు సభ్యులు మిగిలారు. వారిలో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, ఒక గ్రూప్ కానీ అంటే అది సన్నీ, మానస్, కాజల్ అనే చెప్తారు. వారు చాలా వారాలుగా ఒక టీమ్ గా ఉండి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు. సన్నీ ఫ్రెండ్స్ అనగానే ఏ రేంజ్ లో సపోర్ట్ చేస్తాడో మనం చూశాం. కాజల్ కోసం తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను కూడా త్యాగం చేశాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్ లో లెక్కలు మారుతాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. చివరికి ఒకళ్లే గెలుస్తారు. అంటే ఇది ఇండివిడ్యూవల్ గేమ్ మాత్రమే. అందుకే కాజల్ ఇప్పుడు తన స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది.
టికెట్ టూ ఫినాలే కోసం చాలానే కష్టపడ్డారు. అయితే ఆఖరి పోరుకు మాత్రం సన్నీ, సిరి, మానస్, శ్రీరామచంద్ర వెళ్లగలిగారు. ప్రియాంక సింగ్, కాజల్ ముందుగానే తప్పుకున్నారు. షణ్ముఖ్ తో ట్రై బ్రేకర్ ఆడి సన్నీ గెలిచి.. లాస్ట్ టాస్కుకు వెళ్లాడు. అయితే ఆఖరి టాస్కు విషయంలో చాలా రచ్చనే జరిగింది. మరోసారి సన్నీ తన సహనాన్ని కోల్పోయాడు. రచ్చ రచ్చ చేశాడు. కేకలు వేశాడు.. స్లేట్ ను విసిరి కొట్టాడు. ఇదంతా చేసింది ఏ షణ్ముఖ్ తోనే, సిరి మీదనో కాదు. తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ మీద. అవునండి అదంతా జరిగింది కాజల్ తోనే. ఎందుకంటే కాజల్ బాగా డిస్టర్బ్ చేసింది.
కానీ, సన్నీ ఎందుకు అలా చేసింది అనేదే ఇప్పుడు మిలియన్ డారల్ ప్రశ్న. సన్నీ గెలవాలని కోరుకోవాల్సిన కాజల్ ఇలా ఎందుకు చేసింది అని. అందరూ షాకయ్యారు. లేదా కాజల్ ప్లేట్ ఫిరాయిస్తోందా? సన్నీకి క్రేజ్ పెరిగింది అన్న విషయం అందరికీ తెలుసు. లేదంటే టికెట్ టూ ఫినాలే మానస్ కు దక్కాలని ఇలా చేస్తోందా? అనే అనుమానాలు వస్తున్నాయి. బయట కూడా అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కాజల్ గేమ్ సరిగ్గా లేదంటూ కామెంట్స్ చూస్తున్నాం. ఇప్పటివరకు సపోర్ట్ చేసుకున్న కాజల్, సన్నీ ఫ్యాన్స్ మధ్య కూడా చెడిందనే టాక్ వినిపిస్తోంది. మరి అందరూ తమ తమ ఇండివిడ్యువల్ గేమ్ స్ట్రార్ట్ చేశారనే తెలుస్తోంది. కానీ, సన్నీతో వైరం కాజల్ కు అంత మంచిది కాదనేది ప్రేక్షకుల భావన. ఎందుకంటే కాజల్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదని అందరికీ తెలుసు. కాజల్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
