భారతీయ చిత్ర పరిశ్రమలో మరోసారి IT సోదాలు కలకలం రేపాయి. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ ప్రొడ్యూసర్ వషు భగ్నాని, నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ లక్ష్యంగా ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ముంబైలోని వీరి నివాసాలతో పాటు కార్యాలయాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఈ తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. షూటింగ్స్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ,ప్రొడక్షన్ ఖర్చుల ముసుగులో భారీ ఎత్తున నిధులను విదేశాలకు అక్రమంగా తరలించారనే పక్కా సమాచారంతో ముంబై ఐటీ విభాగం ఈ దాడులకు శ్రీకారం చుట్టింది. ఈ లావాదేవీల ద్వారా పెద్ద ఎత్తున TAX ఎగవేతకు పాల్పడినట్లు అలాగే ఆర్థిక అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం రంగంలోకి దిగిన ఐటీ అధికారుల ప్రత్యేక బృందాలు రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు వషు భగ్నానికి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, పనోరమా స్టూడియోస్ కార్యాలయాల్లోని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. విదేశీ పెట్టుబడులు, బ్యాంక్ ఖాతాల వివరాలు, డిజిటల్ లావాదేవీలు డైరీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబానికి చెందిన వ్యాపారాలు మరియు చిత్ర నిర్మాణ వ్యయాల వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ సోదాల నేపథ్యంలో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలు ,స్వాధీనం చేసుకున్న సొమ్ము, డాక్యుమెంట్స్ వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
సినిమాల షూటింగ్‌లు, విదేశీ పంపిణీ హక్కులు , చిత్ర నిర్మాణ వ్యయాల సాకుతో భారీగా నిధులను విదేశాలకు తరలిస్తున్నట్లు ఐటీ శాఖకు సమాచారం అందింది.పన్ను ఎగవేత & మనీలాండరింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు మరియు మనీలాండరింగ్ కోణం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు బలంగా అనుమానిస్తున్నాయి. దీంతోముంబై ఐటీ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఆమెకు సంబంధించిన ఆస్తులు, ముంబైలోని ఇల్లు, వ్యక్తిగత ఆర్థిక కార్యాలయాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ ప్రత్యేక బృందాలు ప్రస్తుతం ఆయా సంస్థలకు చెందిన డిజిటల్ లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, అంతర్జాతీయ నిధుల బదిలీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాయి.
