కొన్ని అద్భుతాలు జరుగుతుంటే మన కళ్లను మనమే నమ్మలేం. అవి మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయంటే చూడకుండా ఉండగలమా అదే జరగనుంది గురువారం. హైదరాబాద్ వాసులు మరోసారి అరుదైన సంఘటనను ఆస్వాదించి, సాక్ష్యాలుగా మారనున్నారు.
‘నిను వీడని నీడను నేను..’’ అని తెలుగులో ఓ పాట ఉంది. నీడ ఎప్పుడూ మన వెంటనే ఉంటుందని, నీడలా వెంట ఉంటానని చెప్పటమే ఈ పాట ఉద్ధేశ్యం. అందుకే చాలా మంది నీడలా నీ వెంట ఉంటా అంటూ ఉంటారు.
మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపం సమయంలో నీడ కనిపించడం లేదంటే అందరికి ఆశ్చర్యం గానే ఉంటుంది. అయితే అలాంటి అరుదైన దృశ్యం ఇటీవలే బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో కూడా నీడ పడని రోజు రానుంది. మరి.. ఆ జీరో షాడో డే ఎప్పుడు,.. ఈ వివరాలు
ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చీకటిలో మన నీడ మనకు కనిపించదు కానీ, మిగతా సమయాల్లో నీడను చూసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం వేళ మన నీడ కనిపించదట. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపం సమయంలో నీడ కనిపించడం లేదంటే..