మై విలేజ్ షో అనే యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు గంగవ్వ. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడుతూ, మంచి వాక్చాతుర్యంతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. యితే ఇటీవల ఆమె ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునుద్దేశించి ఓ టివీ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కలలు అందరూ కంటారు ఆ కలలను కొందరే సాకారం చేసుకుంటారు. అటువంటి వారిలో ఒకరు గంగవ్వ. 60 ఏళ్ల వయసులో తానేమీ సాధించగలను అనుకునే వారందరికీ ఆమె ఓ రోల్ మోడల్. ఆమె జీవితమే ఓ పాఠం. ఇళ్లు కట్టుకోవాలన్న కలను నెరవేర్చుకున్న ఈ బామ్మ.. ఇప్పుడు మరో జర్నీ స్టార్ చేశారూ.
యూట్యూబ్ లో వీడియోల ద్వారా తనదైన కామెడీ పండిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది గంగవ్వ. అచ్చమైన పల్లెటూరి ముసలవ్వ పాత్రల్లో నటిస్తూ.. తన యాసతో అందరి మనసు దోచుకుంది. ఇక తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4 లో తెలుగు రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరైంది. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో అందరినీ పలకరించే గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో పేరు తెచ్చేసుకుంటోంది. ఈ మద్య గంగవ్వ బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తన […]