కొవిడ్ వ్యాక్సిన్ వస్తే గాని మనుషుల జీవితం సాధారణ స్థితికి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు, మందుల తయారీ సంస్థలు అయితే పూర్తిగా ఆ పనిలోనే ఉన్నాయి. సులభంగా చెప్పాలంటే ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి వ్యాక్సిన్ల గురించి అపోహలు, కుట్ర సిద్ధాంతాలు, […]