యువతీ యువకుల జీవితాల్లో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. ఎన్నో ఆశలతో వారి వైవాహిక జీవితాలను ప్రారంభిస్తారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ అన్యోన్యంగా జీవించాలని కోరుకుంటారు. ఆదర్శ దంపతులుగా పేరొందాలని సంసార జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.