అప్పులు, అధిక వడ్డీలు, ఆపై ఒత్తిళ్లు వెరసి ఓ చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్డేలా చేశాయి. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా పెడనలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాసిన పద్మనాభం(55), నాగలీలావతి(47) దంపతులకు రాజా నాగేంద్రం(27), వెంకట నాగలక్ష్మి సంతానం. వృత్తిపరంగా చేనేత కార్మికులైన పద్మనాభం.. కుమార్తె వివాహం కోసమని గతేడాది విఠల్ లోకేష్, జీవనప్రసాద్ ల వద్ద రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఏడాదిలోగా అప్పు, వడ్డీ కలిపి రూ.4.60 లక్షలకు చేరుకుంది. […]