అప్పుడే పదో తరగతి పాసైన ఓ పల్లెటూరి కుర్రాడు ఏదో సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. గుండెనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. నెత్తిన గంప పెట్టుకొని చిత్తు కాగితాల వ్యాపారం మొదలుపెట్టాడు. నేడు కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడి జీవిత ప్రయాణం ఇలా సాగింది. ఆయన పేరు మంగినిపల్లి యాదగిరి.. చదువుకున్నది పదో తరగతి. నిరుపేద కుటుంబంలో జన్మించిన యాదగిరి.. డబ్బుల్లేక కుటుంబం పడుతున్న […]