భారత్ వేదికగా అక్టోబర్ లో వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో ఈ వరల్డ్ కప్ జరగనుండడంతో టీమిండియా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద ఎక్కువ బాధ్యత ఉంది. నిన్న ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేయగా.. వీరిద్దరు ఈ మ్యాచ్ లపై స్పందించారు. అయితే కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఒకే గ్రౌండ్ మీద మనసు పారేసుకోవడం గమనార్హం.
సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ముంబై లోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.