ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి గంటలకొద్ది లైన్‌లో నిల్చొని మరీ ఓటు వేయాల్సి వచ్చేంది. ఈ కారణం చూపి చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోరు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటింగ్ విధానంలో మార్పు తెచ్చే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే ఓటేసే విధానాన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా […]