దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయండంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సంగతి అందరికీ విదితమే. ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం ప్రక్రియ మొదలైపోగా, ఇప్పుడు ఓటర్ వివరాల వంతొచ్చింది. అందుకు సంబంధించినదే ఈ కథనం.
మన దేశంలో 18 ఏళ్లు నిండితేనే మేజర్‌గా గుర్తింపు లభిస్తుంది.. ఓటు హక్కు కూడా అప్పుడే వస్తుంది. తొలుత ఓటు హక్కు రావాలంటే 21 ఏళ్లుగా ఉండేది. కానీ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని 18 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. దాని ప్రకారం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం […]
విపక్షాల నిరసనల మధ్య ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను అనుసంధానం చేసే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు – 2021 లోక్‌సభలో ఆమోదించబడింది. ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC)తో ఆధార్‌ను లింక్ చేయాలని బిల్లు కోరింది. ఈ బిల్లును కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీఎస్పీ తదితర ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేస్తే అది పౌరుల రాజ్యాంగ హక్కులను, వారి గోప్యత హక్కును […]
న్యూ ఢిల్లీ- ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా డిమాండ్ ఉన్న ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022లో పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. ఈ మేరకు ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం […]