తప్పు చేసిన వారికి శిక్ష పడటం సహజం. అయితే జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు బుద్ధిగా ఉండాలి అనేం ఉండదు. కొందరు జైలు నుంచి పారిపోయేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పారిపోగలిగినా.. కొందరు మాత్రం దొరికి మళ్లీ తిరిగి జైలుకే వస్తుంటారు.
రోజులు మారాయి. పిదప కాలం మనుషులు, పిదప కాలం బుద్ధులు అన్నట్లు.. నేటి పిల్లలు దారుణంగా తయారయ్యారు. ఇంట్లోనే కాదు.. చదువులు చెప్పే విద్యాలయాల్లోనూ వారి తీరు మారటం లేదు. తమకు ఇబ్బంది కలిగితే ఎంతకైనా తెగిస్తున్నారు. చంపటానికైనా వెనకాడటం లేదు. తాజాగా, ఓ 6 ఏళ్ల పిల్లాడు మహిళా టీచర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. తనతో గొడవపెట్టుకోవటంతో తుపాకితో కాల్చాడు. అది కూడా తరగతి గదిలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన అమెరికాలో శుక్రవారం చోటుచేసుకుంది. […]