వినాయక చవితి నేపథ్యంలో ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన కాంత యాదవ్ ఆవుపేడతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేశారు. హిందూ సంస్కృతితో ఆవుపేడను పవిత్రంగా భావిస్తుంటారు. అందుకే ఎండిన ఆవుపేడతో కలప దుమ్ము, మైదా పొడి కలిపి మిశ్రమాన్ని వినాయకుడి అచ్చులో పోసి విగ్రహాన్ని తయారు చేశామని 15 నిమిషాల్లోనే తయారు చేసిన ఈ విగ్రహాలు ఆరబెట్టడానికి నాలుగైదు రోజులు పడుతోంది. […]
వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతల కార్యక్రమాలకు కరోనావైరస్ నిబంధనలు అడ్డురానప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రం కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు ఎలా వర్తింపజేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సంస్మరణ సభకు కరోనా లేదు కానీ విపక్షాలు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాలు చేస్తే కరోనా కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ […]