వైద్యో నారాయణో హరి అంటారు.. ఆ దేవుడు మనకు ఊపిరి పోస్తే.. వైద్యులు ఏ ఆపద ఉన్నా మన ప్రాణాలు రక్షిస్తుంటారు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ ఈ మద్య కొంత మంది వైద్యులు వైద్య వృత్తికే కలంకం తీసుకు వస్తున్నాడు. డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
కరోనా కల్లోల కాలంలో ఎవరిని కదిలించినా కష్టాలే వినిపిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నలిగిపోయిన జీవితాలు ఎన్నో. ఇంకొందరైతే ఆప్తులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. కానీ.., ఇన్ని విషాద ఘటనల నడుమ కూడా కొన్ని విచిత్ర సంఘటనలు అందరిని ఆశర్యపరుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. జగయ్య పేటలో ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త గడ్డయ్య కొలిమి పని […]