ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడటం.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
సాధారణంగా ఎక్కడైన డిస్కౌంట్ అంటే జనం ఎగబడుతుంటారు. ఈ డిస్కౌంట్ అనేది చిన్న షాపుల నుంచి మొదలు కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా ఉంటుంది. అయితే కొన్ని చికెన్ సెంటర్లు కూడా డిస్కౌంట్ తో చికెన్ విక్రయిస్తుంటారు. అలానే ఓ వ్యక్తి.. ఎప్పుడూ కళ్లు చెదిరే తగ్గింపు ధరలతో చికెన్ విక్రయించే వాడు. దీంతో జనం ఎగబడే వారు. తోటి షాపుల వాళ్లకు ఏమి అర్ధమయ్యేది కాదు. మొన్న జరిగిన బక్రీద్ పండుగ […]