మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన్ని కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం వసంత కుమార్ భౌతిక దేహాన్ని విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి తీసుకెళుతున్నారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. […]