ఇండస్ట్రీలో సక్సెస్ ని చూసిన సెలబ్రిటీలు ఎవరైనా కొన్నాళ్ళకు దీనస్థితిలో కనిపిస్తే.. ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా తారసపడుతున్నాయి. గతంలో స్టార్స్ గా వెలిగిన వారు.. అనారోగ్యం బారినపడి, కనీసం వైద్యం ఖర్చులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో ఎదురు పడటం అనేది అందరినీ కలచివేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత వి. ఏ. దురైని చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.