బ్యాంకుల్లో డబ్బు దాచుకునేదే రేపొద్దున ఏ కష్టమొస్తుందో.. ఏ అవసరమొస్తుందో అన్న భయంతో.. మరి అలా దాచిన డబ్బు కోసం ఎవరూ రాకుంటే..? అది ప్రభుత్వానికే. అవును కొన్నేళ్ల పాటు ట్రాన్సక్షన్స్ జరగపోయినా.. డబ్బు కోసం ఎవరూ రాకపోయినా వారి ఖాతాలో మొత్తాన్ని ఆర్‌బీఐకి బదిలీ చేస్తారు.
సాధారణంగా ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తారు. తమకు అవసరం ఉన్నప్పుడల్లా కొద్ది మెుత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా బ్యాంకుల్లో డబ్బు రోటేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కొన్ని ఖాతాల్లో డబ్బు అలాగే మూలకు పడి ఉండడాన్ని ఆర్బీఐ గుర్తించింది. వాటిని క్లెయిమ్ చేయని నిధులు అంటారని పేర్కొంది. ఈ నిధుల గురించి మరిన్ని వివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. బ్యాంకింగ్ రంగంలో క్లెయిమ్ […]