హైదరాబాద్- అసెంబ్లీలో తన భార్య నారా భవనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారని వెక్కి వెక్కి ఏడ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోజులు గడిచిన కొద్ది చంద్రబాబు నార్మల్ అవుతున్నారు. ఆ ఘటన తరువాత తన కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు చాలా ఉల్లాసంగా గడిపారు. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవరాలి వివాహం హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ […]