అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. ఈ మధ్యకాలంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. పైగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాటిపై రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో.. వాహనదారులు విద్యుత్ వాహనాలపై మక్కువ చూపిస్తున్నారు. మధ్యతరగతి వారు కూడా ఎలక్ట్రిక్ టూవీలర్స్ ని కొనేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్, బౌన్స్ ఇన్ఫినిటీ వంటి వివిధ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు టూవీలర్ ఎలక్ట్రిక్ రంగంలో సత్తా చాటుతున్నాయి. అయితే వినియోగదారులు రేంజ్ పై దృష్టి సారిస్తున్నారు. ధర ఎంత ఉన్నా గానీ రేంజ్ బాగుంటే కొనేందుకు వెనకడుగు […]