మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ‘అంబక ‘మంటే ‘నేత్ర’ మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని – అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి – అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. ‘త్రయంబకం యజామహే – సుగంధిం […]