పకృతి అందాలను తిలకించేందుకు వెళ్తున్న పర్యాటకుల విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో జరిగింది. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకెళ్తున్న.. ఏరో శాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన.. సింగిల్ ఇంజిన్ లైట్ వెయిట్ విమానం ఈ ప్రమాదానికి గురైంది. శుక్రవారం సాయంత్రం మరియా రైచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే నాజ్కా విమాన కేంద్రానికి దగ్గర్లో […]