ఎవరికైనా డబ్బు కలిసొచ్చినా.. మంచి జరిగినా నీ పంట పండింది అంటారు. అయితే అందరి కడుపు నింపే మెజారిటీ రైతుల పంట మాత్రం ఎప్పుడూ పండింది లేదు. కానీ ప్రస్తుతం చాలా మంది రైతులు లాభాల బాట పడుతున్నారు. దీంతో రైతుల పంట కూడా పండుతుంది.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. సుమారు నెల రోజుల నుండి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇప్పుటి వరకు 150 నుండి 180 మధ్య ఊగిసలాడుతున్న టమాటా రేటు.. రూ. 200 పలుకుతుంది.
రెండు నెలల క్రితం వరకు టమాటా కేవలం రూ.20 నుంచి రూ.30 వరకు మాత్రమే పలికింది. గత నెల నుంచి టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి.. ఏకంగా కిలో 150 నుంచి 200 రూపాల వరకు పెరిగిపోయింది. దీంతో ప్రజలు టమాటాలు కొనాలంటే భయపడిపోతున్నారు. దాని బదులు రెండు మూడు రకాల కూరగాయాలు వస్తాయని అంటున్నారు.
కిలో 25 రూపాయిల నుండి అమాంతం రూ. 150 వరకు కూడా ధర వెళ్లిపోతుంటడంతో వంటిల్లు బోసిపోయింది. కూరల్లో టమాటా లేక కర్రీలన్నీ చప్పగా మారిపోయాయి. ఏ కూరగాయలు లేకపోయినా.. కేవలం టమాటాలతో కర్రీ లేదా టమాటా బాత్ అయినా చేసి చెప్పి పిల్లలకు, భర్తకు లంచ్ చేసే మహిళలకు
మొన్నటి వరకు సరైన గిట్టుబాటు ధర లేదని రోడ్లపై పడవేసిన టమాటా ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. రూ.10 లకు పలికే టామాటా ఇప్పుడు ఏకంగా రూ.100 లకు పైనే పలుకుతుంది.