ఏ ఆటలో అయినా విజయం సాధించాలంటే కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా కలసి రావాలి. ఈ విషయంలో టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ కోహ్లీకి అంతగా అదృష్టం లేదనే చెప్పుకోవాలి. ఆటగాడిగా కోహ్లీ స్థాయి ఎవ్వరూ అందుకోలేనిది. కెప్టెన్ గా కూడా కోహ్లీ రికార్డ్స్ అందరికన్నా ఎత్తులోనే ఉన్నాయి. ఆట పరంగా, కమిట్మెంట్ పరంగా కోహ్లీ పోరాటాన్ని ఏ మాత్రం తక్కువ చేయలేము, చేయకూడదు కూడా. ఇప్పటికీ టీమిండియా ఆశాదీపం కోహ్లీనే. కానీ.., అదృష్టం విషయంలో […]
పే టీఎం టీ20 సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి ఛాంపియన్స్ గా నిలిచింది. టాపార్డర్ లో రోహిత్ వేసిన బేస్ ను తర్వాతి బ్యాట్స్ మన్లు వినియోగించుకోలేక పోయారు. రోహిత్ తర్వాత గేమ్ కొంత స్లాగ్ అయ్యింది. వికెట్ కూడా త్వరగానే కోల్పోయింది. కాస్త ఫామ్ లో కనిపించిన హర్షల్ పటేల్ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే గౌరవ ప్రదమైన స్కోర్ ఉంది. కానీ, భారీ స్కోర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ, […]
టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ప్రస్థానం ముగిసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వేదికగా కెప్టెన్ గా నమీబియాతో కోహ్లీ చివరి మ్యాచ్ ఆడేశాడు. ముందుగా ప్రకటించినట్టే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పొట్టి క్రికెట్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. కెప్టెన్‌గా తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ అందుకోసం కోహ్లీ కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా తన ప్రదర్శన కంటే […]
‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’లో భారత్ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. వార్మప్ మ్యాచ్‌లు మినహా మిగిలిన రెండు మ్యాచ్‌లు ఘోర పరాభవాలే ఎదురయ్యాయి. పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫలితమే మళ్లీ రిపీట్ అయ్యింది. న్యూజిలాండ్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపించింది. టోర్నమెంట్‌కి ముందు వేసిన అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. చెప్పిన మాట, వేసిన వ్యూహం ఏదీ కలిసి రాలేదు. 20 ఓవర్లలో 110 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. […]
‘ఐపీఎల్ 2021’ ముంబయి ఇండియన్స్ మొదట తడబడ్డా.. ఇప్పుడు పుంజుకుంటోంది. ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. అయితే ఈసారి వారి అదృష్టం కోల్‌కతా చేతిలో కూడా ఉంది. వచ్చే మ్యాచ్‌లో ముంబయి గెలిచి.. కోల్‌కతా ఓడిపోతే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. ముంబయి ఇండియన్స్‌కి ఇది కొత్తేం కాదు. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి గతంలోనూ కప్పు కొట్టిన చరిత్ర వారికి ఉంది. ఈసారి కాకపోతే వారి అదృష్టం కోల్‌కతా చేతిలో […]