చదువుల తల్లి ఒడిలో తమ బిడ్డలు క్షేమంగా ఉంటారని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశతో గురుకులాలకు, హాస్టళ్లకు పంపిస్తుంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ తీరు చూస్తుంటే.. ఆ భరోసా కాస్తా ఇప్పుడు భయంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా నియామకాలు, మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపంతో పసిప్రాణాలు గాలిలో కలుస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది? ఈ […]
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్మును వైన్స్లో పెట్టుబడులుగా పెట్టారు. షేర్ మార్కెట్లో పెట్టారు. ఆస్తులు, బంగారం కొన్నారు. ఇదీ మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణి తీరు. ఇటీవల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆమెకు రూ.6.76 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ […]
Telangana : తెలంగాణ రాష్ట్రానికి పెను ముప్పు పొంచి ఉందా..? ఇప్పటివరకు మనం ఎడారి ప్రాంతాల్లో మాత్రమే చూసిన భయానక వాతావరణ పరిస్థితులు..తెలంగాణలో చూడబోతున్నామా…? రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వస్తున్నా…హెచ్చరికలు నిజమేనా.. ఎండలే కాదు.. రానున్న 10 నెలల్లో తీవ్ర కరువు పరిస్థితులు, తాగునీటి కొరతలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తాయా..అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది..దీనికి ప్రధాన కారణం..వాతావరణ శాఖ అలర్ట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు […]
తెలంగాణలో మద్యం ప్రియులు బ్యాడ్ న్యూస్. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ప్రభుత్వం నూతనంగా విధించతలపెట్టిన పన్నుల భారానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన తమ వ్యాపారాలను ప్రభుత్వం తీసుకుంటున్న పన్నుల నిర్ణయాలు మరింత దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ బార్పై వార్షికంగా 8 శాతం నుంచి 20 శాతం వరకు […]