ఆసియా కప్ 2025కు ప్రకటించిన టీమ్ ఇండియా జట్టుపై వివాదం రేగుతోంది. సమర్ధులకు చోటు దక్కకపోవడం ఓ కారణమైతే..15మందినే ఎంపిక చేయడం మరో కారణం. ఇది సెలెక్షన్ కమిటీ నిర్ణయమా లేక బీసీసీఐ నుంచి ఆదేశాలొచ్చాయా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. జాతీయ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. మరి కొద్దిరోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15మందితో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించింది. […]