హైదరాబాద్ లోని జెఎన్ టియులో విద్యార్థిని మృతి మర్చిపోక ముందే.. మరో యూనివర్శిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ)లో చదువుతున్న అంజలి అనే విద్యార్థిని హాస్టల్ బిల్లింగ్ పై నుండి దూకి చనిపోయింది. ఈ మృతి వార్త తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇప్లూ వద్దకు చేరుకుని, దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసులు […]