పాకిస్థాన్ యువ బౌలర్ మొహమ్మద్ హస్నైన్ త్రో బౌలింగ్ వేస్తున్నాడంటూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ యాక్షన్ చేసి మరీ చూపించాడు. స్టోయినీస్ చేసిన ఈ పని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సదరన్ బ్రేవ్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ సదరన్ బ్రేవ్ తరపున బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవల్ తరపున ఆడుతున్న పాక్ పేసర్ మొహమ్మద్ హస్నైన్ […]