చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నవలా రచయిత తల్లావర్జుల సుందరం మాస్టారు కన్నుమూశారు. ఆయన తన 71వ ఏట సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. తన ఆప్త మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్ చేసిన సుందరం మాస్టారు.. తన ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న మాస్టారు శిష్యులు ఇంటికి చేరుకుని ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాస్టారు మృతితో […]